Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెనాలి యువకుల కేసులో తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: గోరంట్ల మాధవ్

Gorantla Madhav says Tenali youth case verdict is a slap to the government
Advertisement
  • బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాధవ్ డిమాండ్
  • చట్టాలను కాకుండా లోకేశ్ 'రెడ్ బుక్'ను పోలీసులు అమలు చేస్తున్నారని ఆరోపణ
  • పోలీసు వ్యవస్థ గౌరవాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శ
Advertisement
గుంటూరు జిల్లా తెనాలిలో నలుగురు దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసిందని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నలుగురు యువకులను కోర్టు నిర్దోషులుగా తేల్చడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పారు. ఈ ఘటనలో బాధితులు ఎదుర్కొన్న అవమానానికి, మానసిక క్షోభకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.

గతేడాది నలుగురు యువకులను పోలీసులు రోడ్డుపై దారుణంగా కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని గోరంట్ల మాధవ్ గుర్తుచేశారు. ఈ కేసులో కోర్టు యువకులను నిర్దోషులుగా విడుదల చేయడంతో, ప్రభుత్వం వారిపై తప్పుడు కేసు బనాయించిందని స్పష్టమైందన్నారు. బాధితుల గౌరవానికి, ఆత్మగౌరవానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజల హక్కులను కాలరాస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత వంటి చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులు, వాటిని పక్కనపెట్టి నారా లోకేశ్ నియంత్రణలో ఉన్న 'రెడ్ బుక్'ను అమలు చేస్తున్నారని విమర్శించారు. కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలకు జీ హుజూర్ అంటూ పోలీస్ శాఖ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
Gorantla Madhav
Tenali Dalit youth case
Andhra Pradesh court verdict
YSRCP leader Gorantla Madhav
Chandrababu Naidu government
AP police Red Book controversy

More Telugu News